తెరిచిన పాఠశాల.. పంతులు హాజరు

– నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ -మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న తడుగూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దుల గల కరగ్ గ్రామ ప్రాథమిక పాఠశాల గత రెండు నెలలుగా బడి బంద్ అనే శీర్షికతో బుధవారం నాడు నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించినట్లు తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారి కరగ్ గ్రామ పాఠశాలను బుధవారం తెరిపించి ఆ పాఠశాలకు ఒక పంతులుని పంపించారు. గత రెండు నెలలుగా బడి బందు ఉండడంతో పంతులు వచ్చిన పాఠశాలకు పిల్లలు హాజరు కాని పరిస్థితి పాఠశాల తెరిచి సాయంత్రం వరకు ఒకే ఒకడుగా కూర్చొని ఆ పంతులు వెళ్లినట్లు సమాచారం బడి బంద్ కథనానికి కరగ్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు బడికి పంతులు రావడం నవ తెలంగాణ కథనం కదిలించిందని అభినందించారు