
ట్రాఫిక్ నిబంధనలను పాటించి ఆటోలను నడపాలని సిఐ తిరుపయ్య ఆటో డ్రైవర్లకు సూచించారు. సోమవారం భిక్కనూరు పట్టణంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆటో పత్రాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలలో ఎక్కించుకోవద్దని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వాహనాలు నడిపితే కేసు నమోదు చేసి, ఆటోలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.