ఆవులపల్లి జలాశయం పనులు ఆపాలి

– కేఆర్‌ఎంబీకి సర్కారు లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు ఆవులపల్లి జలాశయం పనులు నిలిపి వేయకుండా ఏపీ ప్రభుత్వం కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర సాగునీటి,పారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి. మురళీధర్‌ దాదాపు 36 పేజీల లేఖను కేఆర్‌ఎంబీకి పంపారు. ఈ మేరకు పనులను వెంటనే ఆపడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.