ఈ ఏడాది సాధారణ వర్షపాతం

– జూన్‌లో తక్కువే: ఐఎండీ అంచనా
న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాల రాక నెమ్మదించినా ఈ సంవత్సరం వర్షపాతం సాధారణంగానే ఉంటుందని భారత వాతా వరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. జూన్‌లో సాధారణం కంటే తక్కువగానే వర్షాలు పడ తాయని, అయితే జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో మొత్తంమీద సాధారణ వర్షపాతం నమోదవుతుందని వివరించింది. ఈ కాలం లో సగటున 96% వర్షపాతం ఉంటుం దని వాతావరణ విభాగానికి చెందిన డీఎస్‌ పారు చెప్పారు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా పం జాబ్‌, హర్యానా, ఢిల్లీ సహా దేశంలోని వాయ వ్య ప్రాంతంలోనూ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో నూ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అయితే కొన్ని సానుకూల అంశాల కారణంగా దేశంలో మొత్తం మీద సాధారణ వర్షపాతమే నమోద వుతుంది. సీజన్‌ ప్రారంభంలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల పలు ప్రాంతాలలో వేసవి పంటలపై ప్రభావం పడే అవకాశం ఉంది.