– మంత్రి తలసానికి కాంగ్రెస్ హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీపై, రేవంత్ రెడ్డిపై అహంకార పూరితంగా మాట్లాడం మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను కాంగ్రెస్ హెచ్చరించింది. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, నాయకులు మల్లు రవి, ఈ అనిల్‌కుమార్, అద్దంకి దయాకర్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు విలేకర్లతో మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించు కున్నామనీ, ఎవరో ఒకరితో రాష్ట్రం సాధ్యం కాలేదని చెప్పారు. తలసాని తల పొగరు మాటలు యదవులకు పూసి కుల రాజకీయలకు పాల్పడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ తర్వాత ప్రజల్లో వచ్చిన అదరణను చూసి బీఆర్‌ఎస్ అందోళన చెందుతుందన్నారు. దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు పొలిటికల్ టూరిస్ట్‌లేనా? అని ప్రశ్నించారు.