
భిక్కనూరు మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్నా తెలంగాణ సౌత్ క్యాంపస్ లో ఇటీవల కాలంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ ను భిక్కనూర్ మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, దోమకొండ జడ్పిటిసి తిరుమల గౌడ్ బుధవారం శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అంజయ్య, లలిత, యాదాద్రి, నారాయణ, సునీత, సరిత, కాంగ్రెస్ నాయకులు సీతారాం, మధు, తదితరులు ఉన్నారు.