నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని నాలేశ్వర్ గ్రామ పంచాయతీలో నూతనంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సర్పంచ్ సరీన్ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. గ్రామంలోని అజయ్, శ్వేత, రాధిక, సోనీ లు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడం పట్ల ఎంతో గౌరవంగా ఉందని అన్నారు. వివేకానంద గ్రంథాలయంలో సభ్యుడిగా ఉండి ఉద్యోగం పొందిన బొప్పరం అజయ్ తన తొలి జీతం నుండి గ్రంథాలయ అవసరాలకు 50 శాతం ఇస్తానని ప్రకటించారు. దీంతో యువతి, యువకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మణ్, ఎంపీటీసీ శ్యామల, వార్డు సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు.