నవతెలంగాణ – భిక్కనూర్
ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతూ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సోనియా శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో 10/10 మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలోని జంగంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10/10 మార్కులు సాధించిన వైష్ణవిని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డీఈవో రాజు, సోనియా శంకర ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు లింబాద్రి, విద్యా కమిటీ చైర్మన్ పోచయ్య, ఉపాధ్యాయులు గఫూర్ శిక్షక్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.