సీజనల్ వ్యాధుల పై విద్యార్థిని లకు అవగాహన..

– బాలికలకు వ్యాసరచన పోటీలు బహుమతులు అందజేత..
నవతెలంగాణ- రెంజల్
సీజనల్ వ్యాధులపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన అవసరమని మలేరియా యూని ట్ అధికారి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం రెంజల్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ముందుగా దోమలపై వచ్చే వ్యాధులపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన బాలికలకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి వైష్ణవి, ద్వితీయ బహుమతి అక్ష శ్రీ, తృతీయ బహుమతి లహరిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల వలన వచ్చే వ్యాధులు మలేరియా, ఫైలేరియా, మెదడువాపు, డెంగీ చికెన్ గునియా, మొదలగు వ్యాధులు సోకుతాయి కాబట్టి ప్రతి కుటుంబం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలన్నారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ దోమలు మన పరిసరాలలో పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు డయేరియా, పచ్చకామెర్లు, టైఫాయిడ్ వ్యాధులు రాకుండా స్వచ్ఛమైన నీటిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. బాలికలు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ భోజనం కు ముందు, తరువాత, చేతులు శుభ్రంగా కడుగుకొని భోజనం చేయాలన్నారు. అనంతరం డాక్టర్ వినయ్ కుమార్ విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు 250 మందికి గాను 213 మంది బాలికలు ఉన్నారని వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి చింతాల శ్రావణ్ కుమార్, ఆరోగ్య సూపర్వైజర్ మాలంబి, ఆరోగ్య కార్యకర్త లు శాంతకుమారి సరస్వతి, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.