నవ తెలంగాణ- కోటగిరి: కోటగిరి మండల కేంద్రం నందు మంగళవారం గర్భిణీ లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అమ్మ ఒడి కార్యక్రమం లో భాగంగా అందరికి గర్భిణీ లకు మునగ ఆకు ప్రాముఖ్యత, దాని వలన లాభాలు తెలియ తెలియపరచిన అనంతరం జాతీయ కాన్సర్ వ్యాధి పైన ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ అవగాహనా కలిగించారు వేడి వేడి పదార్థాలు ప్లాస్టిక్ కవర్ నందు తీసుకొని వెళ్ళారాదని, బుజించకూడదని, పొగాకు వాడకం తగ్గించాలని, గుట్కా, తాంబకు వాడకం ఇటు వంటి అలవాటు ఉన్నవారు తక్షణమే నిలిపి వేయాలని మీ కుటుంబ సభ్యులకు తెలియ చేయాలనీ కాన్సర్ మహమ్మారి నుండి రక్షించు కోవాలని తెలియ పరచారు,పురుషులలో మరియు మహిళ లలో కాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కావున ఇరువురు జాగ్రత్తగా ఉండాలని తెలియ చేయటం జరిగింది, గుట్కా తినటం, పొగాకు సేవించటం చాలా ప్రమాదకరం అని తెలియ చేయటం జరిగింది ప్రజలు ఎక్కువగా కాచిన నూనెలో తయారు చేసిన పదార్థాలు తినకూడదు అని తెలియచేయటం జరిగింది ప్రతి రోజు మంచి పోషకహారం తీసుకోవటం వలన, వ్యాయామం చేయటం, గోరు వెచ్చని నీటిని త్రాగటం వలన కొద్దివరకు నీవరించా వచ్చునని తెలియ చేయటం జరిగింది స్త్రీలలో ముఖ్యంగా గర్భశాయ కాన్సర్, రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కావున జాగ్రత్తగా ఉండాలని తెలియ చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది జ్యోతి, సాయి కుమారి, ఆరోగ్య కార్యకర్తలు ప్రమీల,రోజా మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.