
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం దరఖాస్తులపై ఆయా గ్రామాలలో సమగ్ర సర్వే జరపాలని గ్రామ కార్యదర్శులకు తాసిల్దార్ రామచందర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, లు సూచించారు. శనివారం తాసిల్దార్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శిలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలలో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని వారు సూచించారు. గ్రామాలలో అర్హులైన వారందరిని గుర్తించి వారి వివరాలను రిజిస్టర్లు నమోదు చేసుకోవాలని వారన్నారు. ఈ అవగాహన సదస్సులో రెంజల్ మండలంలోని గ్రామ కార్యదర్శులు అందరూ పల్గొన్నారు.