యాక్సిస్ నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్

 

 

 

ప్రత్యేకతలు:

  • బెంచ్‌మార్క్: నిఫ్టీ500 ముమెంటం 50 TRI
  • ఫండ్ మేనేజర్లు: శ్రీ కార్తీక్ కుమార్ మరియు శ్రీ సచిన్ రేలేకర్
  • NFO ప్రారంభ తేదీ:  24 జనవరి 2025
  • NFO ముగింపు తేదీ: 07 ఫిబ్రవరి 2025
  • కనీస దరఖాస్తు మొత్తం: రూ. 100, ఆ తర్వాత రూ. 1 గుణిజాల్లో
  • ఎగ్జిట్ లోడ్:
    • అలాట్‌మెంట్ తేదీ నుండి 15 రోజుల్లోగా రిడీమ్ చేసుకున్నా / స్విచ్ అవుట్ చేసినా: 0.25%
    • అలాట్‌మెంట్ తేదీ నుండి 15 రోజుల తర్వాత రిడీమ్ చేసుకున్నా / స్విచ్ అవుట్ చేసినా: నిల్

 నవతెలంగాణ ముంబై: భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఫండ్ హౌస్‌లలో ఒకటైన యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ సంస్థ, నిఫ్టీ500 ముమెంటం 50 టీఆర్ఐని ట్రాక్ చేసే యాక్సిస్ నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్ పేరిట ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్‌వో) 2025 జనవరి 24న ప్రారంభమై ఫిబ్రవరి 7 వరకు అందుబాటులో ఉంటుంది. నిఫ్టీ500 ముమెంటం 50 టీఆర్‌ఐ ఈ ఫండ్‌కి ప్రామాణికంగా ఉంటుంది.

మరింత సరళతరంగా, తక్కువ వ్యయాలతో కూడుకున్న సాధనం ద్వారా, వృద్ధి గతిలో ఉన్న స్టాక్స్ అందించే ప్రయోజనాలను పొందేందుకు, దేశీయంగా పెట్టుబడులకు సంబంధించి ప్యాసివ్ వ్యూహాలపై భారతీయ ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆసక్తిని ఈ కొత్త ఫండ్ ప్రతిబింబిస్తుంది. ఖర్చులు తీసివేయడానికి ముందు, ట్రాకింగ్ ఎర్రర్‌కి లోబడి, నిఫ్టీ500 ముమెంటం 50టీఆర్‌ఐకి అనుగుణమైన రాబడులను అందించాలనేది ఈ స్కీము లక్ష్యం. అయితే, స్కీము యొక్క పెట్టుబడి లక్ష్యం నెరవేరుతుందనే నిర్దిష్ట హామీ ఉండదు.

ముమెంటం ఇన్వెస్టింగ్ అనేది, ప్రస్తుత ధరల ధోరణులు ఇకపైనా కొనసాగే అవకాశాలు ఉంటే, తద్వారా ఒనగూరే ప్రయోజనాలను అందిపుచ్చుకునే విధంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇదొక శక్తివంతమైన వ్యూహంగా చారిత్రకంగా రుజువైంది. భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పటిష్టమైన వృద్ధి గతిని కనపరుస్తున్న స్టాక్స్ పనితీరును మదింపు చేసే విధంగా నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్ రూపొందించబడింది. ఒడిదుడుకులకు తగ్గట్లుగా సర్దుకుంటూ, గత 6 నెలలు మరియు 12 నెలలుగా మెరుగైన రాబడులు అందిస్తున్న స్టాక్స్ తీరుతెన్నులను ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. అత్యుత్తమంగా రాణిస్తున్న స్టాక్స్‌పై ప్రధానంగా దృష్టి పెడుతూ, ఇటీవలి కాలంలో మెరుగైన పనితీరు కనపర్చిన స్టాక్స్‌, భవిష్యత్తులోనూ మరింతగా రాబడులను అందించే అవకాశాలు ఉండవచ్చనే అంచనాలతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మదుపరులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ఫండ్ ప్రయత్నిస్తుంది. యాక్సిస్ నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్ అనేది అధిక ముమెంటం కనపరుస్తున్న టాప్ 50 స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ప్రయోజనాలను మదుపరులకు అందిస్తుంది. నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్‌లోని ప్రత్యేకత ఏమిటంటే ఈ విధానంలో నిర్దిష్ట లార్జ్, మిడ్ మరియు స్మాల్‌క్యాప్స్‌ ఎంపిక చేయబడతాయి. కాబట్టి, పరిమాణంపరంగా ఇన్వెస్టర్లు వివిధ రకాల ముమెంటం వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉండదు.

“ఇన్వెస్టర్లకు వినూత్నమైన పెట్టుబడి సాధనాలను అందించేందుకు మేము చేస్తున్న కృషిలో భాగంగా యాక్సిస్ నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. ప్యాసివ్ వ్యూహాలకు ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో, ఒకవైపు వ్యయాలను తక్కువ స్థాయిలో ఉంచుతూ, విస్తృతమైన డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను అందిస్తూ, దేశీయంగా అత్యంత ఆశావహంగా కనిపిస్తున్న ముమెంటం ఆధారిత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని ఈ ఫండ్ కల్పిస్తుందని మేము విశ్వసిస్తున్నాం. స్టాక్ ఎంపికపై నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా మార్కెట్ ధోరణుల ఆధారంగా ప్రయోజనాలను పొందాలనుకుంటున్న ఇన్వెస్టర్లకు ఇది సముచితమైన ఫండ్ కాగలదు” అని యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ ఎండీ మరియు సీఈవో శ్రీ బి. గోపకుమార్ తెలిపారు.

యాక్సిస్ నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్

యాక్సిస్ నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్‌ను శ్రీ కార్తీక్ కుమార్ (ఈక్విటీ ఫండ్ మేనేజర్) మరియు శ్రీ సచిన్ రేలేకర్ (సీనియర్ ఈక్విటీ ఫండ్ మేనేజర్) నిర్వహిస్తారు. కనీస దరఖాస్తు మొత్తం రూ. 100 కాగా ఆపైన రూ. 1 గుణిజాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీము ప్యాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాన్ని అమలు చేస్తుంది. నిఫ్టీ500 ముమెంటం ఇండెక్స్‌లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది.

“భారత్‌లో ఎప్పటికప్పుడు మారిపోయే మార్కెట్ పరిస్థితులను ఎదుర్కొని నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్ దీటుగా రాణిస్తోంది. వృద్ధికి అవకాశమున్న స్టాక్స్‌ను ఎంచుకోవడం ద్వారా కొన్ని సందర్భాల్లో విస్తృత మార్కెట్ సూచీలకు మించి మెరుగైన పనితీరు కనపరుస్తోంది. ఇటీవలి కాలంలో పటిష్టంగా ఊర్ధ్వముఖంగా పయనిస్తున్న స్టాక్స్ అందించే ప్రయోజనాలను అందిపుచ్చుకోవడంపై మూమెంటం ఆధారిత విధానం ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్ అనేది, విస్తృత స్థాయిలో ఉన్న భారతీయ కంపెనీల వృద్ధి గాధలో పాలుపంచుకునే దిశగా, తక్కువ వ్యయాలతో కూడుకున్న, సరళతరమైన ప్యాసివ్ వ్యూహంగా ఉండగలదు. సుదీర్ఘ కాలం నిలడకగా రాబడులను అందించే అవకాశాలతో పాటు విస్తృతమైన వ్యూహాన్ని అమలు చేయగలిగే సామర్థ్యాల వల్ల ఈ ఫండ్ ఇటు కొత్త ఇన్వెస్టర్లు అటు అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లకు కూడా దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఉపయోగపడే పటిష్టమైన సాధనంగా, ఆకర్షణీయమైన ఎంపికగా నిలవగలదని మేము విశ్వసిస్తున్నాం” అని యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ సీఐవో శ్రీ ఆశీష్ గుప్తా తెలిపారు.

యాక్సిస్ నిఫ్టీ500 ముమెంటం 50 ఇండెక్స్ ఫండ్ ప్రత్యేకతలు

  • ట్రెండ్‌ని అనుసరించడం: ధరలపరంగా ఊర్ధ్వముఖంగా పయనించే ధోరణులను కనపరుస్తున్న స్టాక్స్‌ను గుర్తించి, ఇన్వెస్ట్ చేయడంపై ముమెంటం ఇన్వెస్టింగ్ ప్రధానంగా దృష్టి పెడుతుంది. లార్జ్, మిడ్ మరియు స్మాల్ క్యాప్స్‌వ్యాప్తంగా మార్కెట్లో మారిపోయే ధోరణులకు అనుగుణంగా ఇది పని చేస్తుంది. దీనితో ఇన్వెస్టర్లు వివిధ రకాల ముమెంటం వ్యూహాలను అమలు చేయాల్సి రావడం వల్ల తలెత్తే గందరగోళం, ఒత్తిడి తగ్గుతుంది.
  • ఇటీవలి పనితీరు ఆధారంగా స్టాక్స్ ఎంపిక: ముమెంటం ఇన్వెస్టింగ్ అనేది సాధారణంగా ఇటీవలి కాలంలో, అంటే గత 6 నుండి 12 నెలల వ్యవధిలో మెరుగ్గా రాణించిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడంపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.
  • బిహేవియోరల్ ఫైనాన్స్: సమాచారాన్ని బట్టి ఇన్వెస్టర్లు అతిగా స్పందించడం లేదా అస్సలు స్పందించకపోవడం, అలాగే పక్షపాతంగా వ్యవహరించడం వంటి ధోరణుల కారణంగా ముమెంటం ఏర్పడుతుంది. ఇన్వెస్టర్ల ధోరణి కచ్చితమైన హేతుబద్ధతతో ఉండదు కాబట్టి, మార్కెట్లో ఒడిదుడుకులు నెలకొంటాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ముమెంటం వ్యూహాలను అమలు చేసేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తోడ్పడతాయి.
  • ఇతర వ్యూహాలకు అనుబంధంగా ఉండటంతో పాటు పోర్ట్‌ఫోలియో సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది: ఇతర వ్యూహాలకు అనుబంధంగా ఉంటూనే క్రమశిక్షణతో ముమెంటం వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియో పనితీరును మెరుగుపర్చుకునే విధంగా ఇది డిజైన్ చేయబడింది.
  • తక్కువ వ్యయాలు: ప్యాసివ్‌గా నిర్వహించబడే ఇండెక్స్ ఫండ్ కావడం వల్ల, సాధారణంగానే దీని వ్యయాల నిష్పత్తి తక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఇది తక్కువ వ్యయాలతో కూడుకున్న ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా ఉండగలదు.