
నవతెలంగాణ-గోవిందరావుపేట
సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలి అంటే బి ఆర్ ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అధిక మెజారిటీతో గెలవాలని ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పసర పంచాయతీ మూడవ వార్డులో గడపకు ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ ప్రచారంలో శ్రీనివాసరెడ్డి పాల్గొని బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించిన పథకాలను ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించారు. 60 యేండ్ల కాంగ్రెస్ పాలన కాలంలో ప్రజలకు చేసింది ఏమి లేదని, ఈ రోజు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని,9 సంవత్సరాల కాలంలో గ్రామాల రూపు రేఖలు మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది అనీ, ములుగు నియోజకవర్గం జెడ్పీ చేర్మెన్ బడి నాగజ్యోతి నాయకత్వంలో అడుగడుగునా అభివృద్ది చెందింది. ములుగు నియోజకవర్గం [బి ఆర్ ఎస్] పార్టీ అభ్యర్థి నగ జ్యోతి అక్కా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని. తెలిపారు. ఈకార్యక్రమంలో[పి ఎ సి ఎస్]డైరెక్టర్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాసాచారి, వరదం చందర్ రాజు, ఎడవెల్లి వెంకటరెడ్డి, కొండి రమేష్ ,సాబాది మధు పసునూరి నర్సిరెడ్డి, డేగల అశోక్, పెంతల బాబు, బైరబోయిన శ్రీనివాస్, ముక్క శ్రీనివాస్, ఎంపెల్లి శ్రీనివాస్, రామటంకి సంపత్, సామ అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.