
కామారెడ్డి జిల్లా తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా జంగం బాల ప్రకాష్ ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా జర్నలిస్టు యూనియన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బాల ప్రకాష్ ను జిల్లా జర్నలిస్టుల కార్యవర్గ సభ్యునిగా ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల తోటి జర్నలిస్టులు అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.