నవతెలంగాణ – నవీపేట్: గ్రామ సేవకులను రెగ్యులర్ చేస్తూ క్యాబినెట్లో ఆమోదం తెలిపిన సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు పేల్చి తహసిల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా వీఆర్ఏ మండల అధ్యక్షులు పెంటయ్య మాట్లాడుతూ.. వీఆర్ఏలు రెగ్యులర్ గురించి ఎంతో కాలం నుండి వేచి చూస్తున్నారని వారి ఆశలను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, క్యాబినెట్ మంత్రులు మరియు ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లక్ష్మణ్, కార్యదర్శి పండరి, కోశాధికారి ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు నరేష్, ముఖ్య సలహాదారులు రంజిత్, నర్సయ్య, అష్షు తదితరులు పాల్గొన్నారు.