రాజకీయ భిక్ష పెట్టిన బాలసానిని విస్మరించారు

– భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి పొందేం వీరయ్య
నవతెలంగాణ/వెంకటాపురం
రాజకీయ భిక్ష పెట్టిన బాలసాని లక్ష్మీ నారాయణ ను విస్మరించి రాజకీయ లబ్ది కోసం కొందరు నాయకులు ఉన్నారని భద్రాచలం కాంగ్రెస్‌ అభ్యర్థి పొందేం వీరయ్య ఎద్దేవా చేశారు.మండల కేంద్రం లోని సొసైటీ కళ్యాణ మండపం లో కాంగ్రెస్‌ ముఖ్యనేతల ఆత్మీయ సమ్మేళనం సోమవారం బ్లాక్‌ అధ్యక్షులు చిడెం శివ అధ్యక్షత న జరిగింది .ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి పొందే వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గద్దెనెక్కడం ఖాయమని జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో మండలంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి 4వేలకుకు పైగా మెజారిటీ వ చ్చిందని. ఈ ఎన్నికల్లో ఆ మెజారిటీ 8వేలకు వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. మండలంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని కి గుర్తింపు నివ్వని బీఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్‌ బలం వాజేడు,వెంకటాపురం మండలాల్లో రెట్టింపు అయిందన్నారు. సమావేశంలో పీఏ సీఎస్‌ అధ్యక్షులు చిడెం మోహనరావు, మండల అధ్యక్షులు సయ్యద్‌ హుస్సేన్‌,సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు నల్లపు దుర్గాప్రసాద్‌, మన్యం సునీల్‌ ,బాలసాని శ్రీను, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.