మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట..

 – బాన్సువాడ ఎక్సైజ్ సీఐ యాదగిరి రెడ్డి.
నవతెలంగాణ- నసురుల్లాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బాన్సువాడ ఎక్సైజ్ శాఖ డివిజన్ పరిధిలో మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు డివిజన్ లో 98 కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశామని బాన్సువాడ ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్ పేక్టర్ యాదగిరి రెడ్డి తెలిపారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో 16,478 లీటర్ల కల్లును ద్వంసం చెయ్యడం జరిగింది.92.87 లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకోవడం జరిగింది,120.25 లీటర్ల బీరు సీసాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.3.2 కిలోల గంజాయని పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు 17 లక్షల 20 వేలు వరకు ఉంటుందన్నారు. ద్విచక్ర వాహనాలు, కారు, ఇతర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ యాదగిరి రెడ్డి తెలిపారు.
నిరంతరం నిఘా పెట్టాం..
ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి మద్యం వినియోగించే అవకాశం ఉంది. అభ్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఎక్సైజ్ శాఖ నిరంతరం ప్రత్యేక బృందాలతో నిఘాపెట్టి కట్టడి చేస్తున్నాం. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తునమన్నరు. వీరి వెంట ఎక్సెస్ శాఖ ఎస్సై తేజస్విని ఎక్సైజ్ శాఖ పోలీస్ సిబ్బంది షారిపోద్దిన్ ఇతరులు ఉన్నారు.