ఆరోగ్యానికి అరటి..

Banana for healthఅరటి పండ్లు ఏ సీజన్లోనైనా విరివిగా లభిస్తాయి. సామాన్యుడికి అందుబాటు ధరలో లభించే అరటి పండ్లలో బోలెడు పోషకాలున్నాయి. చక్కెరకేళి, అమతపాణి… ఇలా మన దేశంలో బోలెడు రకాల అరటి పండ్లు లభిస్తున్నాయి.
అరటి పండులో శరీరానికి సరిపడా కాల్షియం, ఐరన్‌ ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. పిల్లల ఎదుగుదలకు కూడా అరటి ఉపయోగపడుతుంది. అరటి పండ్లలో విటమిన్‌ ఏ, బీ, సీ పుష్కలంగా ఉంటాయి.
అరటి పండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. తిన్న తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. బరువు పెరగాలని అనుకునే వారు అరటి పండ్లు తింటే ప్రయోజనం లభిస్తుంది. కండరాల బలహీనతను నివారించడంలో అరటిపండ్లు తోడ్పడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెంపొందడంలో.. ఎసిడిటీని దూరం చేయడంలో, అల్సర్లను తగ్గించడంలో అరటి పండు కీలక పాత్ర పోషిస్తుంది.
అరటి పండ్లలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మలబద్ధకం సమస్య దూరం కావడానికి ఇవి ఉపయోగపడతాయి. డయేరియాతో బాధపడేవారు అరటి పండ్లు తింటే మంచిది. జీర్ణాశయం గోడలకు ఉండే సన్నటి పొర నాశనం కాకుండా అరటి కాపాడుతుంది. అరటి పండు కండరాలు పట్టివేయడాన్ని నివారిస్తుంది.
అరటి పండ్లలో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కటి నిద్ర పట్టేలా చేస్తాయి. నిద్రిస్తున్నపుడు రక్త పోటుని కూడా అరటి పండు నియం త్రిస్తుంది. అరటిలోని పొటాషియం శరీరం లోని టాక్సిన్లను తొలగిస్తుంది. అరటి పండు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
అరటి వద్ధాప్య ఛాయలను దరిచేరనీయదు. బాగా మగ్గిన అరటి పండును మెత్తగా చేసి కొద్దిగా తేనె కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. అరటి రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది.
అరటి పండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు వీటికి దూరంగా ఉండాలి.