నాచారంతో ఎనలేని అనుబంధం ఉంది:బండారి లక్ష్మారెడ్డి


నవతెలంగాణ-నాచారం
నాచారంతో తనకు ఎనలేని అనుబంధం ఉందని బీఎల్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మెన్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నాచారం విలేజ్‌ లోని శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం రెండో అంతస్థు ఎలక్ట్రిసిటీ పనుల నిమిత్తం లక్ష రూపాయలు విరాళంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అన్న బండారి రాజిరెడ్డి కాప్రా మున్సిపల్‌ చైర్మెన్‌గా, ఉప్పల్‌ ఎమ్మెల్యేగా, టీటీడీ పాలకమండలి సభ్యుడుగా ఎనలేని సేవలను అందించారని, నాచారం డివిజన్‌ వాసిగా నివాసం ఉంటూ నాచారం ప్రాంతంతో విడదీయరాని అనుబంధం తమ కుటుంబానికి ఉందని గుర్తు చేశారు. నాచారం ప్రజలు ఏది కావాలని అడిగినా వెంటనే వారి కష్టాలలో పాలుపంచుకొని తమ చేతనైన సహాయం అందించి అండదండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్య, వైద్య సేవలను పేదలకు అందించేందుకు బీఎల్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ శాంతి సాయిజెన్‌ శేఖర్‌, మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవ స్థానం మాజీ చైర్మెన్‌ పోగుల వెంకటరమణ రెడ్డి, కొమరవెల్లి మల్లన్న దేవస్థానం పాలక మండలి సభ్యులు ఎర్ర గొల్ల మల్లేష్‌ యాదవ్‌, భక్త సమాజం ప్రతినిధులు సాయిబాబా, ప్రేమ్‌ కుమార్‌ గౌడ్‌, జగన్నాథం, యాదగిరి, యాదయ్య యాదవ్‌, సత్తయ్య, యాదగిరి గౌడ్‌, శివరాజ్‌, పోచయ్య, శ్రీనివాస్‌, సుదర్శన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు కట్టబుచ్చి గౌడ్‌, విఠల్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, రామకష్ణ, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.