నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధ, గురువారాల్లో రెండురోజులపాటు డీఎడ్, బీఎడ్ కాలేజీల బంద్‌కు డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రకటించింది. విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి వెళ్లిన ఉపాధ్యాయ అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ డీఎడ్, బీఎడ్ కాలేజీలను బుధ, గురువారాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు.