ఎన్నికల్లో పోటీపై బండ్ల గణేశ్‌ ట్వీట్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని తెలిపారు. కూకట్‌పల్లి స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగనున్నారనే ప్రచారం నేపథ్యంలో బండ్ల గణేశ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ”ఈసారి జరిగే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాకు అవకాశం ఇస్తామని చెప్పారు. కానీ నాకు ఈసారి టికెట్‌ వద్దు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం.. దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్‌ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం.. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం” అని బండ్ల గణేశ్‌ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.