నాణ్యతలోపంతో బస్తీ దావఖాన – పట్టించుకోని ఇంజనీరింగ్‌ అధికారులు

నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్‌ 65వ డివిజన్‌ పరిధి ఎల్లాపూర్‌లో నూ తనంగా నిర్మిస్తున్న బస్తీదవాఖాన పరిస్థితి అధ్వా న్నం గా ఉందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. నిరు పేదల ఆరోగ్య సంక్షేమం కోసం వైద్య సేవలను అం దుబాటులోకి తీసుకువచ్చేందుకు గాను బస్తీ దవాఖా నాల నిర్మాణ పనులను చేపట్టింది. అయితే ఈ నిర్మా ణ పనుల్లో సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమా ణాలు పాటించడం లేదని, కనీసం భద్రతతో కూడిన క్వాలిటీని మేయింటేన్‌ చేయడం లేదన్న ఆరోపణలు విని పిస్తున్నాయి. ఇంజనీరింగ్‌ అధికారులు ఇచ్చిన ప్లానింగ్‌ ప్రకారం నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా పనులు కొనసాగుతున్నాయని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల్లో ఒక వరుస రౌతు కట్టడం కాకుండా ఐదు ఇంచుల బెడ్డును పిల్లర్‌టూపిల్లర్‌కు సమానం లేకుం డా చేపట్టారని స్థానిక ప్రజలు ఆరోపిస్తన్నారు.ఎక్కువ కాలం మన్నికగా ఉండే భవన నిర్మాణ పనుల్లో నాణ్య తా ప్రమాణాలు లోపిస్తే ప్రజల ప్రాణాలుగాలిలో కలి సిపోవాల్సిందేని నిపుణులు తమఅభిప్రాయాలను వ్య క్తం చేస్తున్నారు. ప్రజారోగ్య రక్షణకోసం చేపట్టే ఇటు వంటి భవన నిర్మాణపనుల్లో నాణ్యతా ప్రమాణా లు పాటించే విధంగా ఇంజనీరింగ్‌ అధికారులు తమ ప ర్యవేక్షణలో కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.