మండలంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో బాలికలు అందరూ కూడ సాంప్రదాయిక దుస్తులు ధరించి, రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కోలాటాలు నృత్యాలతో అలరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ ర్యక్రమంలో బాలే లక్ష్మి, కృష్ణ చైతన్య, రాజశ్రీ, మేఘన, శ్రీ లక్ష్మీ, శ్రీలత, మాధూరి, నాగశ్రీ, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.