సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

నవతెలంగాణ-మియాపూర్‌
సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గచ్చిబౌలి నెమలినగర్‌లో బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెమలినగర్‌ అధ్యక్షులు రఘు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పూల ద్వారా నిర్వహించుకునే పండగ బతుకమ్మ అని తెలిపారు. ప్రపంచానికే పూల ద్వారా పండుగ నిర్వహించుకునే సాంప్రదాయం ఒక తెలంగాణలో మాత్రమే ఉందని తెలిపారు. తెలంగాణ సాంప్రదాయాలు పద్ధతులు ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం సిబ్బంది రవీందర్‌, ప్రకాష్‌, సుమలత, సావిత్రి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.