నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
హన్మకొండ, కిషన్ పురలోని చైతన్య (డీమ్డ్ టుబి విశ్వవిద్యాలయం)లో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆధ్యాపకు రాళ్లు, విద్యార్థినీలు కలిసి రకరకాల పూలతో బ తుకమ్మలను తయారు చేసి, అందరూ విశ్వవి ద్యాలయ ప్రాంగణంలో ఒకదగ్గర పేర్చి ఆట, పాటలతో, కోలాటాలతో అలరించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణం రంగవల్లులతో ఇంద్రధనస్సును తలపించింది.. ఆధ్యాపకురాళ్ళు విద్యార్థినిలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో బతుకమ్మ పాటలతో మా బతుకులను చల్లంగా చూడు తల్లి అని ప్రార్ధించారు. ఈ వేడుకలో విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ జి.దామోదర్‌చ ఓయస్డి డాక్టర్ కె.వీరవెంకటయ్య, డీన్‌అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ యన్.కవి త, డీన్, అడ్మిషన్స్ ప్రొఫెసర్ ఎస్.సుమ, డీన్, ఫాకల్టీ ఆఫ్ సైన్స్, ప్రొఫెసర్ సుందర్‌రామ్, ప్రొఫెసర్ జి.శంకర్ లింగం, డీన్ ఫాకల్టీ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెసర్ వి.మల్లికార్జున్, డీన్స్, విద్యార్థులు పాల్గొన్నారు.