
మండలంలోని పలు గ్రామాలలో పెద్ద బతుకమ్మ పండుగను ఘణంగా నిర్వహించారు. శనివారం చివరి రోజు పెద్ద బతుకమ్మను గ్రామాలలో ఆడపడుచుల హడావిడి మద్య పండుగ వాతావరణంలో కొనసాగీంది. తీరోక్క పువ్వులను సేకరించి కాంపిటేషన్ గా ఒకరికి మించి ఒకరు బతుకమ్మలను పెర్చినారు. ఉదయం నుండి కొత్త వస్త్రాలను ధరించి ముప్పై గ్రామపంచాయతి గ్రామాలలో బతుకమ్మలను ఆట పాటలతో గ్రామాలలో మహిళలు కోలాటాల మద్య చిన్నారులు, మహిళలు, వృద్దులు పాల్గోన్నారు. గ్రామాలలో గ్రామ సర్పంచులు ఏర్పాట్లను గ్రామ ముఖ్యమైన కూడళ్లలో ఏర్పాటు చేసారు. సాయంత్రం వాగులలో, కుంటలలో, చెరువులలలో, కాలువలలో బతుకమ్మను నిమజ్దనం చేసి పాటలతో ఆటలతో ఉల్లాసంగా తిరుగు ప్రయాణం అయ్యారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, మహిళలు, యువతులు తదితరులు పాల్గోన్నారు.