నవతెలంగాణ- తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క- సారలమ్మ వనదేవతలను ఆదివారం సతీ సమేతంగా బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కష్ణమోహన్ రావు, సతీమణి సుధశ్రీ, బంధుమిత్రులతో కలిసి దర్శించుకు న్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు డోలు వాయిద్యాలతో ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క- సారలమ్మ, పగటిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు పసుపు, కుంకుమ,చీరే,సారే సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కష్ణ మోహన్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడం గొప్ప అనుభూతి కలిగించిందని, మానసిక ప్రశాంతత కలిగిందని అన్నారు. రాష్ట్రంలో అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలు జెట్ స్పీడ్‌తో అమలవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రగతిని సమతుల్యంగా కొనసా గిస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలకు దశలవారీగా తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.