
కళాశాలలో సీట్లు ఇప్పిస్తానని విద్యార్థుల తల్లి తండ్రులను మోసం చేసిన బీ సీ స్టూడెంట్ రాష్ట్ర కన్వీనర్ ను యల్ బి నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ ఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నాగోల్ ఫతుల్లా గూడ,సాయి రాఘవేంద్ర కాలనీ కి చెందిన కట్ట జస్వంత్ అలియాస్ జస్వంత్ గౌడ్,అలియాస్ బబ్ల్యూ గౌడ్.ఇతను బీ సీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కన్వీనర్ గా కొనసాగుతు నారాయణ గూడ లో ఉన్న ఇంజనీరింగ్(కే ఎం ఐ టీ)కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో బీ ఈ సీటు ఇప్పిస్తానని మామిడి అమరేంద్ర నుండి 10లక్షల రూపాయలు వసూలు చేసి కాలయాపన చేయడంతో అనుమానం వచ్చి యల్ బి నగర్ పోలీసులను ఆశ్రయించగా కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా గతంలో అతనిపై ఆదిబట్ల,మొయినా బాద్ లలో కూడా కేసులు నమోదయ్యాయి.మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.