ఠాక్రేతో బీసీ నేతల భేటీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పార్టీ నిర్ణయించినట్టు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండేసి చొప్పున బీసీలకు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్‌ పార్టీ బీసీ నేతలు కోరారు. మంగళవారం హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏఐసీసీ ఇంఛార్జ్‌ మానిక్‌రావు ఠాక్రేతో నాయకులు భేటీ అయ్యారు. ఇప్పటికే వారు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డిలను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాజాగా ఠాక్రేను కలిసిన వారిలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌ మధు యాష్కీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ఉపాధ్యక్షులు గాలి అనిల్‌, సంగిశెట్టి జగదీష్‌ తదితరులున్నారు.