న్యూఢిల్లీ : ఢిల్లీ తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌పై బీసీ సంఘాల కార్యకర్తలు దాడి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పలువురు ఆయనను తోసేసి కొట్టేందుకు యత్నించారు. కాంగ్రెస్‌నేత మధుయాష్కీని విమర్శిస్తున్నందుకు టార్గెట్‌గా ఈ దాడి చేసినట్టు తెలిసింది. కాగా, దాడి అనంతరం గోనె ప్రకాష్ కాంగ్రెస్ నేత మధుయాష్కీపై పలు ఆరోపణలు చేశారు. మధుయాష్కీ మోసగాడని, ఆయన కుటుంబం తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాల్లో ఉంటున్నారని ఆరోపించారు. న్యూయార్క్‌లో ఒక ఆటార్నీని మోసం చేసినందుకు న్యూయార్క్ కోర్టు లాయర్‌గా యాష్కీని నిషేధించిందన్నారు. మధు యాష్కీ అమెరికాలో అంట్లు తోమారేమో అని, దొంగ సర్టిఫికెట్లతో డిగ్రీలు సంపాదించారన్నారు. కాకతీ య, గుల్బర్గా వర్శిటీల నుంచి ఆర్టీఐతో తాను సమా చారం సేకరించినట్లు చెప్పారు. గతంలోనూ యాష్కీ తనపై దాడి చేయించారనీ, చావుకు కూడా భయపడనని అన్నారు. మధుయాష్కీపై హైకోర్టులో పోరాడుతున్నట్టు చెప్పారు.