రైతుపై ఎలుగుబంటు దాడి చేసిన ఘటన మండలంలోని మద్దికుంట లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…. గ్రామానికి చెందిన కొడగండ్ల చిన్న బాలయ్య గ్రామ శివారులో పంట పొలాల్లో గేదెలను మేపడానికి మరో ముగ్గురు రైతులతో కలిసి ఉండగా ఒక్కసారి మూడు ఎలుగుబంట్లు రావడం, ఒక ఎలుగుబంటు దాడి చేయడంతో చిన్న బాలయ్య గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.