శోభ

ప్రపుల్ల సాగర వదనంపై
ప్రపంచ జీవన మధనంపై
కదులుతున్నది కవితా తరంగం..
భానుడి లేలేత కిరణాల సోయగం
ఆహ్వానించి – ఆస్వాదించిన
పసిడి కడలి సౌందర్యం..
పచ్చటి పచ్చిక ఆదరాన
వెచ్చటి పవన చుంబనం
ఇది అనుదినం అరుదైన సంగమం..
ముద్దులొలికే మూగజీవుల విన్యాసం
సన్నని పిల్లగాలుల మురళీ గానం…
పవిత్ర హదయానికి పరాకాష్ఠ
ధరిత్రి నుదుటన సింధూరమై
సంచలిస్తూ సంచరించే దివాకరం..
అడుగుజాడలను
ఆరాధించే ఆడపడుచులు
మడుగు అడుగులను ఆఘ్రాణించే మత్స్యరాజములు..
మబ్బులకనువుగా మయూర నర్తనములు
మదు, మధుర కోకిల
వసంత సంకీర్తనములు..
అంతరాయాలను ఆగ్రహించి
ఆంతరంగిక సౌదంలో.,
నిశ్శబ్ద సంభాషణ సాగించే
వక్ష తేజమ్ములూ…
చరిత్ర తెలిపినా/ చరిత్ర నిలిపినా..,
జగతి జీవన భ్రమరంలో
ధన’పడగ ధరిత్రి నిండా పరచుకుంటున్నప్పుడు
ఎంతటి అమలిన సౌందర్య మైనా…,
అంతర్ధానమేనా…
కదిలే కాల భ్రమణంలో

– బొడ్డుపల్లి సాయిశంకర చారి, 8978972067