నవతెలంగాణ-సిటీబ్యూరో
స్కంధన్షి రిటైల్ ప్రయివేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో కె.సురేష్ కుమార్ రెడ్డి స్థాపించిన ‘బ్యూటీ అండ్ బియాండ్’ స్కిన్‌కేర్ స్టోర్ మియాపూర్ జీఎస్‌ఎం మాల్‌లో వారి 13వ స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘బ్యూటీ అండ్ బియాండ్’ బిజినెస్ హెడ్ శివ గోవర్థన్ మాట్లాడుతూ త్వరలో నగరం అంతట, దేశ వ్యాప్తంగా ప్రాదాన నగరల్లో స్టోర్‌లు ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇక్కడ స్టోర్‌లో, మేబెల్‌లైన్, మామా ఎర్త్, హ్యూగో బాస్, లోరియల్, గార్నియర్, ఛాంబర్, మరెన్నో బ్యూటీ అండ్ బియాండ్ అన్ని ప్రీమియం బ్రాండ్‌లను కలిగి ఉన్నామన్నా రు. వీటితో పాటు తమ స్వంత బ్రాండ్ ”దేశీన్యూట్రి”ని కలిగి ఉన్నామన్నారు. ఇది సహజమైన ఉత్పత్తి, సంపూర్ణమైన జీవనశైలిని కొనసాగించడానికి ప్రతి ఒక్కరికీ సహాయపడుతుందని చెప్పారు. ప్రస్తుతం తమ బ్రాంచీలు కొండాపూర్, ప్రగతినగర్, శరత్ సిటీ మాల్, గచ్చిబౌలి, ఏఎస్ రావ్ నగర్, బెంగళూరులో లేఅవుట్, కమర్షియల్ స్ట్రీట్ పుత్తెనహళ్లి, అక్షరు నగర్, ఓరియన్ అవెన్యూ మాల్, ఓరియన్ గేట్‌వే మాల్, గలేరియా మాల్‌లో స్టోర్‌లను కలిగి ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమన్ టీవీ వ్యవస్థాపకులు దూది సుమన్, బ్యూటీ అండ్ బియాండ్ డైరెక్టర్ జగతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.