కె విశ్వనాథ్ స్మారక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఫైనల్ స్క్రీనింగ్, విజేతల ప్రకటన వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్బంగా నిర్మాత అల్లు అరవింద్, నటి మంజు భార్గవి తదితరులు విజేతలను శాలువాలతో సత్కరించారు.
స్క్రీనింగ్ అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ, ‘విశ్వనాథ్‌తో నేను యంగ్‌గా ఉన్నప్పుడే ‘శుభలేఖ’ సినిమా తీశాను. అది అదష్టంగా భావిస్తున్నా. ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్‌గా కూడా ఫీలవుతాను. విజేతలు 8 మంది స్టేజీ పైకి వచ్చారు. అందరిలోనూ ఎంతో టాలెంట్ ఉంది. వీరంతా లఘు సినిమాలను తీసి ప్రశసంలు పొందారు. మీ టాలెంట్‌ను మహావక్షంలా మలుచుకోవాలని కోరుకుంటు న్నాను. అన్ని సినిమాలు చూశాను. మంచి విలువలతో కూడినవిగా అనిపించాయి. ఈ సినిమాలు చూడగానే నేను తీసిన పాత సినిమాలు కూడా ఒకసారి చూడాలనిపించింది’ అని అన్నారు.
‘లఘు చిత్రాలు ఎలా ఉంటాయో అని మొదట్లో అనిపించింది. కానీ చూడగానే కథ, ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. రెండున్నర గంటలు గొప్ప ఎచీవ్‌మెంట్‌గా అనిపించాయి’ అని నటి, డాన్సర్ మంజు భార్గవి చెప్పారు.
అమల అక్కినేని మాట్లాడుతూ, ‘విశ్వనాథ్ మెమోరియల్ షాట్ ఫిలిం కాంటెస్ట్‌ను ఇండికా ఫిలింస్ ఆర్గనైజింగ్ చేయడం ఆనందంగా ఉంది. యంగర్ జనరేషన్‌కు స్పూర్తిగా ఉంది’ అని తెలిపారు.
‘ఈ లఘు చిత్రాలు ఇండియన్ కల్చర్‌ను వెలుగులోకి తీసుకురావాలని చేసినవి. గురుశిష్య పరంపరలో మన కల్చర్ ఇమిడి ఉంది. అది రిఫ్లక్ట్ చేసే విధంగా మా లఘు సినిమాలు ఉంటాయి. నాలుగేళ్ళ క్రితమే ఇండికా పిక్చర్స్ నెలకొల్పాం. పాజిటివ్ ఫిలింస్, కల్చర్, హెరిటేజ్ ఫిలింస్ చేయాలనుకున్నాం. అందులో భాగంగా విశ్వనాథ్ జోనర్ చేయాలనుకున్నాం. ప్రతి ఏడాది కాంటెస్ట్ ఏర్పాటు చేస్తాం. అలాగే నూతన ప్రతిభకి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాం’ అని ఇండికా పిక్చర్స్ అధినేత అన్నారు.