వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రతో దేశ ప్రజలకు ప్రయోజనం

– కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే
నవతెలంగాణ -పెద్దవూర: కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర భారతదేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ దేశప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మహేంద్ర నాథ్ పాండే అన్నారు. శుక్రవారం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా మండలం లోని పులిచర్ల గ్రామం లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ ఈ సంకల్ప యాత్ర గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను రూపొందించబడిందని తెలిపారు. దీనిని నవంబర్ 15వ తేదీన ఆదివాసీ గౌరవ్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీయే జెండా ఊపి ప్రారంభించారన్నారు. మొదట ఈ కార్యక్రమానికి జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా వేదిక అయిందని ఆతరువాత వివిధ ప్రాంతాలకు విస్తరించేలా షెడ్యూల్‌ను రూపొందించామన్నారు. ఈ యాత్ర దేశంలోని 24రాష్ట్రాల్లోని 68 జిల్లాలతో పాటూ కేంద్రపాలిత ప్రాంతాల్లో సాగుతుందని దేశ వ్యాప్తంగా 8,500 పై చిలుకు గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. గడిచిన పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమాలను గ్రామస్థాయిలో వివరించేందుకు ప్రత్యేకంగా ఐదు ఐసీఈ వ్యాన్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఈ వ్యాన్‌లు జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయితీల్లో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమాలపై ప్రచారాన్ని అందిస్తాయన్నారు.ఇప్పటికే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోస్తున్నా వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి చేకూరడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిన కారణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. 5000 జాతీయరహదారులను క్రమ బద్దిక రించామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు.
దేశం లో అత్యదికంగా మరుగు దొడ్లు కట్టించామని తెలిపారు.ఏ రాష్ట్రం లో లేని విదంగా ఒక తెలంగాణలోనే అత్యదికంగా మరుగు దొడ్లు నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేస్తే కేసిఆర్ ప్రభుత్వం కాజేసిందని అన్నారు. అయోధ్యలో ఈ నెల 22 న రామమందిరం ప్రంభోత్సవం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఎస్బీఐ బ్యాంకులో ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు సేకరిస్తునామని ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కేసిఆర్ ప్రభుత్వం మాయ చేసిందని విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్, డి పిఆర్ ఓ శ్రీనివాస్, ఆర్డి ఓ చిన్నయ్య, ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్ రెడ్డి, బీజేపి మాజీ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, బీజేపి సాగర్ నియోజకవర్గ ఇంచార్జి నివేదిత రెడ్డి,ఎంపీడీఓ లక్ష్మి, ఎంపిఓ విజయకుమారి, ఎంఆర్ ఓ సరోజ, సర్పంచ్ సైదమ్మ, ఎంపిటీసి దేవసాని లక్ష్మి, బీజేపి మాజీ ఉపాధ్యాధ్యక్షులు సుంకి రెడ్డి నారాయణ రెడ్డి, ట్రాన్స్ కొ ఏఈ దాసయ్య పాల్గొన్నారు.