హైదరాబాద్ : అగ్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ బెస్ట్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తమ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. కొండాపూర్‌లోని ఏషియన్ సన్‌సిటీలో నూతన ఆఫీసును తెరిచినట్లు తెలిపింది. కంపెనీ దక్షిణాది వ్యాపారానికి హైదరాబాద్ కేంద్రంగా ఉందని పేర్కొంది. దేశంలోని మొత్తం వ్యవసాయ రసాయన వ్యాపారంలో దక్షిణాది 35 శాతం వాటాను కలిగి ఉందని.. తమ వ్యూహాత్మక కార్యక్రమాలలో కొత్త కార్యాలయం కీలక పాత్ర పోషించనుందని ఆ సంస్థ పేర్కొంది.