ఎంపీడీఓకు ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని ఎంపీడీఓ క్రాంతికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి ప్రశంస పత్రాన్ని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం అందుకున్నారు. విధినిర్వహణలో తనకు సహకారం అందించిన ఉద్యోగులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.