నవతెలంగాణ – హైదరాబాద్: చిన్నారులకు అత్యుత్తమ పోషణను పారాచూట్ అడ్వాన్స్‌డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అందించనుందని మారికో లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సోమశ్రీ బోస్ అవస్తి తెలిపారు. తరతరాలుగా చక్కని సంరక్షణ, పోషణకు మారుపేరుగా ఉన్న పారాచూట్ అడ్వాన్స్‌డ్ ఇప్పుడు బేబీ శ్రేణిని సగర్వంగా ఆవిష్కరించిందన్నారు. ఏళ్ల తరబడి మహిళలకు నమ్మకమైనదిగా ఉన్న పారాచూట్ ఇప్పుడు శిశువుల సంరక్షణను కూడా అందిస్తోందన్నారు. నవజాత శిశువులకు సురక్షితమైనదిగా పేర్కొన్నారు. ఈ ఉత్పత్తులు ఆరు రకాలుగా.. అవి మసాజ్ ఆయిల్, పోషణతో కూడిన సబ్బు, షాంపూ, లోషన్, క్రీమ్, రిఫ్రెషింగ్ పౌడర్లు ఉన్నాయన్నారు. ఇవి శిశువుల సున్నితమైన చర్మానికి సరైన సంరక్షణను అందించడానికి రూపొందించామని తెలిపారు. అన్ని ఉత్పత్తులు వంద శాతం వర్జిన్ కోకోనట్ ఆయిల్ గుణాలతో సమృద్ధిగా ఉంటాయన్నారు. వీటిలో కొన్ని పోషకాలు సహజ మూలాలు తల్లి పాలలో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ బ్రాండ్ (పారాచూట్ అడ్వాన్స్‌డ్) స్వచ్ఛతను కలిగి ఉంటుందన్నారు. పారాచూట్ అడ్వాన్స్‌డ్ బేబీ మసాజ్ ఆయిల్ శిశువుల ప్రత్యేకమైన ఎదుగుదల, అభివృద్ధి అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించబడిందన్నారు. ఈ ఉత్పత్తితో రోజువారీ మసాజ్ చక్కని బరువు, ఎత్తు, బలమైన ఎముకలు, కండరాలు పెరగటం వంటి మూడు ముఖ్య సూచికలకు అండగా ఉంటుందన్నారు. వంద శాతం వర్జిన్ కోకోనట్ ఆయిల్ సుసంపన్నమైన స్పర్శ, కొబ్బరి పాలు, లేత కొబ్బరి నీరు వంటి ఇతర సహజ పదార్ధాల గుణాలతో, పారాచూట్ అడ్వాన్స్‌డ్ బేబీ శ్రేణి సున్నితమైన సమతుల్యతను కలిగి ఉంటుందన్నారు. ఇది మీ శిశువు సంపూర్ణ పెరుగుదల, అభివృద్ధికి భరోసా ఇస్తుందన్నారు. ప్రతీ ఉత్పత్తి డాక్టర్ సర్టిఫికెట్ పొంది శిశువులకు సురక్షితమైనదిగా ఉందన్నారు. ప్రారంభం నుంచి మీ శిశువు అవసరాలకు అనుగుణంగా సున్నితంగా రూపొందించబడిందని తెలిపారు. ఈ ఉత్పత్తుల శ్రేణిని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లలో పరిచయం చేస్తున్నామన్నారు. పిల్లల సంరక్షణలో ఈ ప్రతిష్టాత్మకమైన అధ్యాయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మాతో చేరమని ఆహ్వానిస్తున్నామని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మార్కెట్లకు అనుగుణంగా రూపొందించబడిన ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణలో ఆకర్షణీయమైన, హృదయాన్ని హత్తుకునే యాడ్ గ్రోబేబీగ్రో దాని ఆవిష్కరణ సారాంశాన్ని తెలుపుతుందన్నారు. పారాచూట్ అడ్వాన్స్‌డ్ బేబీ మసాజ్ ఆయిల్.. రోజువారీ మసాజ్‌తో తల్లి, బిడ్డల మధ్య ఉల్లాసభరితమైన సంభాషణ ద్వారా, సంతోషం, ప్రేమ, సంరక్షణ మధురమైన ఆప్యాయతను ప్రదర్శించే ఈ మనోహరమైన కథనం శిశువుల మెరుగైన ఎదుగుదలను సమగ్రంగా పొందుపరుస్తుందని తెలిపారు.