నవతెలంగాణ-బొమ్మలరామారం : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, ఉపాధ్యక్షురాలు తిరుమల కవితవెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండల సర్పంచులు హర్థిక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నూతనంగా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినందుకుగాను మంత్రి సీతక్కను తన నివాసంలో కలిసి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామాల అభివృద్ధి కొరకు, సర్పంచుల సమస్యల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు మేడబోయిన గణేష్, మర్యాల సర్పంచ్ దామోదర్ గౌడ్, మైసిరెడ్డిపల్లి సర్పంచ్ రమాదేవి రాంరెడ్డి, అల్లాపురం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎల్లం బావి సర్పంచ్ కొండల్ తదితరులు పాల్గొన్నారు.