మారుమూల గ్రామాల విద్యార్థులకు మెరుగైన విద్య

– ఎమ్మెల్యే చొరవతో పాఠశాల పనులు వేగవంతం
– సంవత్సరం వరకు పనులు పూర్తి
– కరీంపూర్‌ సర్పంచ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుందరి అనిల్‌
నవతెలంగాణ-కోట్‌పల్లి
మారుమూల గ్రామాల విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన కోట్‌పల్లి మండలానికి కస్తూర్బా గాంధీ గురు కుల పాఠశాల మంజూరు చేయడంతో ఆ పాఠశాలను కోట్‌పల్లి మండల పరిధిలోని కరీంపూర్‌ బస్టాండ్‌ సమీపంలో నిర్మిస్తున్నారు. వికారాబాద్‌ శాసనసభ స భ్యులు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ చొరవతో ఆ పాఠశాల పనులు ఊపందుకున్నాయి. విద్యార్థుల సౌకర్యం కోసం వచ్చే సంవత్సరం వరకు పనులు మొత్తం పూర్తిచేసి ఇవ్వాలని కాంటాక్ట్‌ను ఆదేశించగా సానుకూలంగా స్పందిం చిన కాంట్రాక్టర్‌ సంవత్స రం నాటికి పూర్తి చేసి ఇస్తామని తెలిపినట్టు క రీంపూర్‌ సర్పంచ్‌, బీఆ ర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుందర అనిల్‌ తెలియజేశారు.
ఎమ్మెల్యే చొరవతో అభివృద్ధి
వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ చొరవతో గ్రామాలు అన్ని అభివృద్ధి చెందుతు న్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికీి ప్రభుత్వ పథకాలు అందిస్తుంది. మండలా నికి మంజూరైన పాఠశాల మా గ్రామంలో కట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పాఠశాల అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంది. విద్యార్థుల చదువుకు గాని తల్లిదండ్రుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
– సుందరి అనిల్‌, కరీంపూర్‌ సర్పంచ్‌