
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్య మైన వైద్యం అందిస్తున్నామని కింగ్ కోఠి క్లస్టర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ తెలిపారు. కింగ్ కోఠి క్లస్టర్ పరిధిలోని సుల్తాన్ బజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిం చారు.ఈ వేడుకల్లో తెలంగాణ తల్లి వేషధారణలో పీహెచ్ఎన్ రామలక్ష్మి ఆకట్టుకున్నారు. అనంతరం ఆస్పత్రి సిబ్బందిబోనాలను ఎత్తుకొని కోలాటం ఆడుతూ నృత్యాలు చేస్తూ వేడుకలు జరుపుకున్నారు. ఈకార్యక్రమంలో పి హెచ్ ఎన్ రామలక్ష్మి. ఏఎన్ఎంలు, ఆశా కార్య కర్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు