ప్రభుత్వం స్పందించకపోతే.. భిక్షుటన

ప్రభుత్వం స్పందించకపోతే, భిక్షుటన చేసి, వచ్చిన చందాలతో రామారెడ్డి రంగ చెరువు మరమ్మతులు చేయిస్తాం : జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవ తెలంగాణ-రామారెడ్డి: బీఆర్ఎస్  ప్రభుత్వం ప్రజల పక్షపాతి అని చెప్పుకొని పబ్బం గడుపుతుంది తప్ప, రైతుల సమస్యలపై పరిష్కారానికి కృషి చేయడంలో శూన్యమని, రామారెడ్డి రంగ చెరువు మరమ్మతు చేయకపోవడమే నిదర్శనమని శుక్రవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. గత నెల జెడ్పి సమావేశంలో రంగ చెరువు అలుగు తెగి నీరు వృధా పోతుందని సమస్య లేవనెత్తిన, స్థానిక ఎంపీపీ దశరథ్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటవార్పు చేసి, అలుగులో మట్టి పోసి నిరసన తెలుపడంతో, ఆగమేఘాల మీద జెసిపి ని తీసుకొచ్చి, రోడ్డు మాత్రమే శుభ్రం చేసి, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు, చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. వెంటనే రంగ చెరువును మరమ్మత్తు చేయండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిక్షుటన కార్యక్రమాన్ని చేపట్టి, రైతుల, ప్రజల వద్ద చందాలు పోగుచేసి రంగ చెరువు మరమ్మత్తును చేపడుతామని హెచ్చరించమని పేర్కొన్నారు.