కిసాన్ తాండ నూతన గ్రామపంచాయతీకి భూమి పూజ..

నవతెలంగాణ- రెంజల్

రెంజల్ మండలం కిసాన్ తాండ గ్రామానికి 20 లక్షల రూపాయల ఎస్ టి, ఎస్ డి ఎఫ్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు మంజూరు కాగా, అట్టి నిధులతో సర్పంచ్ మలావత్ జమున విజయ్, ఉప సర్పంచ్ పీర్ సింగ్, భూమి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూమారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్, వీరన్న గుట్ట సర్పంచ్ గణేష్ నాయక్, బాగేపల్లి సర్పంచ్ పాముల సాయిలు, సీనియర్ నాయకులు రఫిక్, ఎంపీడీవో శంకర్, పి ఆర్ ఏ ఈ వినయ్ కుమార్, స్థానిక నాయకులు రోడ్డ లింగం, కృష్ణారావు, సత్యనారాయణ, సంజీవ్, గ్రామ కార్యదర్శి సాయి బాబా, తదితరులు పాల్గొన్నారు.