
డివిజన్ పరిధిలోని నాగంపేట గ్రామంలో గురువారం రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించినారు.
విశ్వ కళ్యాణంలో భాగంగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ ఆశయ సాధన కొరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, ధ్యాన దంపతులు శ్రీమతి శ్రీ మమతా శ్రీనివాస్ మాస్టర్ల ఆధ్వర్యంలో పిరమిడ్ నిర్మాణం కొరకు ఇంజనీర్ శివకాంత్ గారి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేయడం జరిగింది.
పిరమిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలని పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల ఎంతో లాభదాయకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎమ్ నవనాథపురం కమిటీ సభ్యులు అడ్వకేట్ సాయి కృష్ణ రెడ్డి, నల్ల గంగారెడ్డి, శేఖర్ రెడ్డి, అమరవాజి శ్రీనివాస్, నిశాంత్, రాజారాం అమృత రావు, జై డి గంగాధర్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.