దళితుల మధ్య చిచ్చు పెట్టడం భూపతి రెడ్డి మానుకో..

నవతెలంగాణ డిచ్ పల్లి:
దళితుల మధ్య చిచ్చు పెట్టడం మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ రీఛార్జ్ భూపతి రెడ్డి మానుకోవాలని బీఅర్ఎస్ ఎస్సీ మోర్చ నిజామాబాద్ రూరల్ కన్వీనర్ పాశం కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు టిఆర్ఎస్ పార్టీలో ఎందరో ఉన్నారని పార్టీల ఉన్నంత మాత్రాన దళిత బందుకు వారు అర్హులు కారా అని ప్రశ్నించారు కొన్ని గ్రామాల్లో దళిత బంధు రాలేదని అక్కడ ఉన్న దళితులు వచ్చి ఎమ్మెల్యే వివరిస్తే ప్రతి నెల దళిత బంధు వస్తుందని ఎలాంటి ఆందోళన చెందవద్దని దళితులను పైకి తేవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ  మంచి పథకాన్ని ప్రవేశపెట్టారని దీంతో దళితులు వ్యాపారాల్లో స్థిర పడతారన్నారు. గత ఐదేళ్లలో భూపతి రెడ్డికి రూలర్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న అప్పుడు గుర్తుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని ఎన్నికల సమీపిస్తున్నాయనే నేపంతో దళిత బంధు రాని వారిని మాయ మాటలు చెప్పి ద్వేషం పెంచుతున్నారన్నారు దళితులు కూడా ఇతర వారి మాటలు విని మోసపోవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి నిరాధారమైన అరోపణలు చేసే ముందు భూపతి రెడ్డి కొన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. గ్రామానికి ముందస్తుగా ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గ్రామాల్లో సందర్శించినప్పుడు ప్రతి ఒక్కరి కష్టసుఖాలు తెలుసుకుంటూ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారని దానిలో రాత్రి అయిందన్నారు అయినా అన్ని గ్రామాల్లో రాత్రి అయిన ప్రజలు ఘన స్వాగతం పలికారన్నారు. కానీ దళితులను రెచ్చగొట్టి పనులు చేయొద్దని ఇలా అయితే బాగుండదని హెచ్చరించారు. గ్రామాల్లో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి పనులు చేయించారని ఆ ఘనత బాజిరెడ్డికే దక్కుతుందన్నారు. భారీ వర్షాలు వచ్చి ఎన్నో పంటలు దెబ్బతిన్న ఏ ఒక్కరోజు ప్రజల బాధలు భూపతిరెడ్డి పట్టించుకోలేదని ఇప్పుడు లేని ప్రేమను కోల్కబోయడం దేనికి సంకేతమన్నారు. నష్టపోయిన పంట పొలాలు నివాస గృహాలకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సందర్శించి రైతులను బాధితులను వివరాలను తెలుసుకున్నారని కుమార్ వివరించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ జి నరేష్, సినియర్ నాయకులు ముత్తన్న, డైరెక్టర్ నామాల గంగాధర్, బొక్క గంగాధర్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు కిష్టయ్య, సాయి అబ్బయ్య, కాశీరం తో పాటు తదితరులు పాల్గొన్నారు.