వియత్నాం బయలుదేరిన బైడెన్‌

న్Biden left for Vietnamయూఢిల్లీ: అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ జి20 సదస్సును ముగించుకొని వియత్నాం బయల్దేరి వెళ్లారు. ఆదివారం ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ సమాధి వద్ద బైడెన్‌ నివాళి అర్పించారు. అనంతరం విమానాశ్రయానికి చేరుకొన్నారు. అక్కడి నుంచి తన ఎయిర్‌ ఫోర్స్‌వన్‌ విమానంలో వియత్నాంకు బయల్దేరి వెళ్లారు. జి20 సమావేశాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌లో తొలిసారి పర్యటించారు. శుక్రవారం మొదలైన బైడెన్‌ పర్యటనలో తొలి రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తరువాత జి20 సమావేశాల్లో పాల్గొన్నారు. వియత్నాం పర్యటనలో కూడా ఆయన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఎక్కువ దృష్టి సారించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆది, సోమవారాలు బైడెన్‌ వియత్నాంలో ఉంటారు. వియత్నాం కార్యకలాపాల్లో కూడా బైడెన్‌ మాస్క్‌ ధరించే పాల్గొననున్నారు.
భద్రతా దళాల అదుపులో బైడెన్‌ కాన్వారులోని డ్రైవర్‌
కాగా, బైడెన్‌ కాన్వారులో ఓ డ్రైవర్‌ను శనివారం రాత్రి భద్రతా దళాలు అదుపులోకి తీసుకొన్నాయి. డ్రైవర్‌ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని దళాలు ప్రశ్నించాయి. బైడెన్‌ కాన్వారులోని కొన్ని వాహనాలు అమెరికా నుంచి రాగా.. మరికొన్నింటిని భారత్‌లోనే కేటాయించారు. వీటిల్లో అద్దెకు తీసుకొన్న కారు ఒకటి ఉంది. బైడెన్‌ బసచేసే హౌటల్‌ ఐటిసి మౌర్యా వద్ద అది ఉండాల్సి ఉండగా.. యుఎఇ పాలకుడు అల్‌ నహ్యాన్‌ బస చేస్తున్న తాజ్‌ హౌటల్‌ వద్ద అది కనిపించింది. ఒక వ్యాపారవేత్తను అక్కడ డ్రాప్‌ చేసేందుకు తాను వచ్చానని ఆ డ్రైవర్‌ అధికారులకు చెప్పాడు. ప్రొటోకాల్‌ గురించి తనకు తెలియదన్నాడు. కొన్ని గంటలు ప్రశ్నించిన తర్వాత సంతృప్తి చెందిన భద్రతా దళాలు అతడిని వదిలిపెట్టాయి.