భారీ విస్తరణపై బిగ్‌ సి దృష్టి

Big C is eyeing massive expansion– వచ్చే రెండేళ్లలో రూ.300 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్‌ : ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ బిగ్‌ సి భారీ విస్తరణపై దృష్టి పెట్టంది. వచ్చే రెండేళ్లలో కొత్తగా 150 స్టోర్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో 250 స్టోర్లున్నాయి. ఆర్థిక సంవత్సరం 2023-24లో 50 శాతం వద్ధితో రూ.1,500 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బిగ్‌ సి ఫౌండర్‌, సిఎండి బాలు చౌదరి తెలిపారు. కంపెనీ రెండు దశాబ్దాల వేడుకల్లో భాగంగా బిగ్‌-సి బ్రాండ్‌ అంబాసిడర్‌, సినీ నటుడు మహేశ్‌ బాబుతో కలిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై స్వప్న కుమార్‌, డైరెక్టర్లు జి.బాలాజీ రెడ్డి, ఆర్‌.గౌతమ్‌ రెడ్డి, కైలాశ్‌ లఖ్యానితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2002 డిసెంబర్‌ 23న బిగ్‌సి ప్రయాణం ప్రారంభమయ్యిందన్నారు. ఇప్పటి వరకు తొలి స్థానంలో నిలిచామని.. మూడవ దశాబ్దంలోనూ అగ్ర స్థానాన్ని కొనసాగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 3 కోట్ల మంది వినియోగదారులను చేరకున్నామన్నారు.