నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, కుటుంబ సభ్యులు శ్రీ రుక్మిణీ పాండురగా, శ్రీ అయ్యప్ప, హన్మన్ నూతన విగ్రహాల ప్రతిష్టాపన రెండవ రోజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాందీ హన్మంతు, అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా, అర్డీఓ రవి కుమార్ పూజలను పర్యవేక్షించారు. వారిని అర్బన్ ఎమ్మెల్యే బీగాల సన్మానించారు. ఉదయం శాంతి పాఠము, గణపతి పూజ, కర్మణ: పుణ్యాహవాచనము, జపానుష్ఠానములు, మంటప స్థాపిత దేవతల ప్రాతఃకాల పూజలు, మూలమంత్ర సహిత, ఆవాహిత, దేవతల హవనము, జపాంగ హావనము, యంత్ర, విగ్రహ అభిషేక సహిత ధాన్యాధివాసము, అధివాసాంగ హోమము, నీరాజనము, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 5 గంటలకు సాయంకాల ఆవాహిత దేవతా ప్రదోషకాల పూజలు, అధివా హోమాలు, జప హోమాలు, యంత్ర, విగ్రహములకు ఫ పుష్ప, హిరణ్య, వస్త్ర, శయ్యాధివాసుములు, నీరాజనం మంతపుషము, వేదసస్తి, తీర్థ ప్రసాద వితరణ, రాత్రి అన్నదాన కార్యక్రమం చేశారు. సాయంత్రం 7-30 గంటలకు శ్రీశ్రీశ్రీ జగద్గురు హంపి విద్యరణ్య భారతీ మహాస్వామి అనుగ్రహ భాషణము ఉంటుంది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కార్పొరేటర్లు, స్థానిక సర్పంచ్ అశోక్ కుమార్, ఎంపిటిసి ఎస్. వేకటేశ్వర్ రావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ రమణ రావు, మాజీ సర్పంచ్ రాజేందర్, నాయకులు రాజ్ మల్లయ్య, దర్గాల సాయిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రసాద్ గౌడ్, కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.