రామలింగేశ్వరుడికి బిల్వ, బస్మార్చనలు

– కూడవెళ్లి లో ఘనంగా ఆధ్యాత్మిక దినోత్సవ కార్యక్రమం
– ఆలయ ప్రధాన అర్చకులు సంకేత్ శర్మ
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలో భాగంగా కూడవెళ్లి రామలింగేశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు సంకేత్ శర్మ తెలిపారు. బుధవారం అక్బర్పేట్ భూంపల్లి మండల పరిధిలోని కూడవెళ్లి రామలింగేశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వ, బస్మార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.