– ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
– ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ప్రదర్శన, నిరసన
వతెలంగాణ-హిమాయత్‌నగర్
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి రా జ్యాంగం కల్పించిన అధికారాలను లాక్కునేందుకు వినాశక రమైన ఆర్డినెన్స్‌లు తెచ్చి దేశ సమాఖ్య నిర్మాణానికి కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆప్ తెలం గాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ మండిపడ్డారు. ఆర్టికల్ 239ఎఎ(3) (ఎ) పబ్లిక్ ఆర్డర్, పోలీసు, భూమి మి నహా, ఢిల్లీ శాసన సభకు రాష్ట్రం, ఉమ్మడి జాబితాలోని విష యాలపై చట్టాలు చేసే అధికారం ఉంటుందని, దేశ రాజ ధానిలో సివిల్ సర్వెంట్లపై అధికారాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగిస్తూ మే 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తుంగలోతొక్కి, రాజ్యాంగ విరుద్ధ ఆర్డినెన్స్‌లను తెచ్చి మోడీ ప్రభుత్వం కఠోరమైన అధికార దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఢిల్లీ ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చిన ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకుని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ఎదుట భారీ ప్రదర్శన, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధా కర్ మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ త్వానికి, అరాచకవాదానికి అడ్డు అదుపు లేకుండా పోతుం దని, ప్రజల ప్రజాస్వామిక హక్కులను అణచివేస్తోందని ఆరోపించారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యా ంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడితే ప్రజాగ్రహం తప్పదని, ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చిన రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డినెన్స్ ను మోడీ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని లేకుంటే ఢిల్లీ ప్రజలకు అండగా ఉండి ప్రజాస్వా మ్యాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరా టాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ నిరసన ప్రదర్శనలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డా.ఎస్.కె. ఆర్.అన్సారీ, ఎండి.మజీద్, డా.పుట్ట పాండు రంగయ్య, డా.సోలొమన్ రాజు, ఎన్.తిరుమలరావు, ప్రొఫెషనల్ కమిటీ కన్వీనర్ డా.జి.హరిచరణ్, నేతలు టి.రాకేష్ సింగ్, జావేద్ షరీఫ్, సలావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.